ETV Bharat / briefs

ఈ నెల 19 తెరాస కార్యవర్గ సమావేశం

ఈ నెల 19న తెరాస కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎన్నికలన్నీ ముగిసిన నేపథ్యంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి పటిష్ఠపరిచే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

kcr
author img

By

Published : Jun 14, 2019, 10:31 PM IST

Updated : Jun 14, 2019, 11:08 PM IST

ఈ నెల 19 తెరాస కార్యవర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఈనెల 19న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. తెలంగాణ భవన్​లో జరగనున్న సమావేశానికి తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఎన్నికలన్నీ ముగిసిన నేపథ్యంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి పటిష్ఠపరిచే యోచనలో అధిష్ఠానం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన నేతల స్థానంలో కొత్త నేతలకు పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు. నెలాఖరులో కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి... అన్ని జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు శంఖుస్థాపన చేయనున్నారు.

ఇదీ చూడండి: ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 14, 2019, 11:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.