యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆంధ్రవాసులంతా... ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ సొంత రాష్ట్రానికి బయలుదేరారు. తెల్లవారుజామునే టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
చేతులెత్తేసిన టోల్‌ప్లాజా సిబ్బంది
ఓటు వేయాలన్న ఉత్సాహంతో బయలుదేరిన వాహనదారులకు టోల్ ప్లాజా సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. భారీగా వస్తున్న వాహనాలను తొందరగా పంపడంలో విఫలమవుతున్నారు. పండుగలప్పుడు తప్ప సాధారణ సమయాల్లో ఈ టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ అంతగా ఉండదు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి.
టోల్ ప్లాజాల వద్ద ఘర్షణలు
రద్దీ పెరగడం వల్ల టోల్‌ప్లాజా నిర్వహకులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. టోల్ వసూలు చేయొద్దంటూ గొడవకు దిగారు. గేట్లు ధ్వంసం చేసి టోల్ రుసుం చెల్లించకుండానే కొందరు వాహనదారులు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ తగ్గింది.
ఇదీ చూడండి: అసలైన నాయకులనే ఎన్నుకుంటాం...!