ETV Bharat / briefs

లోక్​సభకు పోటీ చేయాలా? వద్దా? సందిగ్ధంలో తెజస

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధంలో పడింది తెజస. నాలుగు స్థానాల్లో పోటీ చేస్తామని ఆపార్టీ అధ్యక్షుడు కోదండరామ్​ ప్రకటించినా.. స్పష్టత రాలేదు. పోటీపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ జన సమితి
author img

By

Published : Mar 22, 2019, 8:00 AM IST

తెలంగాణ జన సమితి
లోక్​ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై తెలంగాణ జన సమితి ఎటూ తేల్చుకోలేకపోతోంది. నాలుగు పార్లమెంట్​ స్థానాల్లో బరిలో దిగుతామని... మిగతా స్థానాల్లో కాంగ్రెస్​కు మద్దతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్​ ప్రకటించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీ భేటీలో ఆ నాలుగు స్థానాల్లో కూడా పోటీ చేయాలా వద్దా అనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

పార్టీ బలోపేతం చేసుకుందాం..

రాష్ట్రంలో పార్టీ ఉనికి చాటుకోవాలంటే కొన్ని స్థానాల్లోనైనా పోటీ చేయాలని కొందరు పార్టీ సభ్యులు సూచించగా... ఓట్లు చీలకుండా కాంగ్రెస్​కు మద్దతు ఇద్దామని మరికొందరు అభిప్రాయపడ్డట్లు సమాచారం. లోక్​సభ ఎన్నికల్లో బరిలో దిగడం కంటే రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికల్లో ఉనికిని చాటుకునే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనే సూచనలూ వచ్చాయి.

పోటీపై మల్లగుల్లాలు..

పార్లమెంట్​ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరితో పాటు మరో స్థానంలో పోటీ చేస్తామని కోదండరామ్​ ఇప్పటికే ప్రకటించారు. ఈ నాలుగు స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన రాష్ట్ర కమిటీలో వచ్చింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్​రెడ్డి ఇప్పటికే కోదండరామ్ మద్దతు కోరినందున... ఆస్థానంలో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది తెజస. కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో పోటీపై మల్లగుల్లాలు పడుతోంది.

లోక్​సభ పోటీపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో బరిలో నిలవడంపై మరో రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెజస వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:లక్ష్యం పదహారు.. గెలుపు గుర్రాలకే పెద్దపీట

Intro:నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని కరేగామ్ గ్రామంలో పండగ పూట విషాదం జరిగింది కరేగాం గ్రామ శివారులో విద్యుత్ తిగలకు తగిలి 10 గేదెలు,3 ఆవులు మృతి చెందాయి,బుధవారం రాత్రి ఈదురు గాలులు వియడంతో గ్రామ శివారులో ఉన్న ఒక విద్యుత్ స్తంభం విరిగి కింద పడిపోయింది,రోజు మాదిరిగా పశువుల కాపరి పశువులను మేపడనికి శివారులో మేపి పశువులను మధ్యాహ్నం పూట నీటిని తాపీ తిరిగి ఎండపుట చెట్టు క్రిందకు తీసుకువస్తున్న సమయంలో విద్యుత్ స్తంభం విరిగి కింద పడి ఉన్న విద్యుత్ తిగలకు పశువులకు తగలడంతో గమనించిన పశువుల కాపరి మిగతా పశువులను దూరంగా కొట్టేశాడు, పశువుల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ,గ్రామస్తులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేశారు,అక్కడికి చేరుకున్న సంబంధిత విద్యుత్ అధికారులు, పశు వైద్యులు పరిశీలించారు,సంబంధిత అధికారులకు రైతులు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు,సంబంధిత అధికారులైన విద్యుత్ అధికారి మాట్లాడుతూ 13 పశువులకు నష్టపరిహారం వచ్చే విదంగా పై అధికారులకు తెలుపతమని అన్నారు

బైట్స్:1)రైతు
2) రైతు
3)సురేందర్ రెడ్డి (pacs చెర్మెన్)
4)విద్యుత్ అధికారి

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.