10 కిలోమీటర్ల దూరం:
ఈ మార్గంలోని రైళ్లు అమీర్‌పేట నుంచి మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఈరెండు స్టేషన్ల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
9 నుంచి 12 నిమిషాల మధ్య:
అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీకి 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో నాలుగు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల మధ్య ఒక రైలు సేవలందించనుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తయిన తర్వాత మిగతా మార్గాల మాదిరిగానే 4 నిమిషాలకు ఒక రైలు సదుపాయం కల్పిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్‌పేట్‌లో రైలు మారాల్సి ఉంటుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.
56 కిలో మీటర్ల మెట్రో మార్గం:
హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్నాయి. 29 కిలో మీటర్ల మియాపూర్- ఎల్బీనగర్, 17 కిలో మీటర్ల నాగోల్- అమీర్‌పేట మార్గాల్లో ఇప్పటికే మెట్రో సేవలుప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్ల అమీర్‌పేట - హైటెక్‌సిటీ మార్గంలో సేవలు మొదలవుతుండటంతో మొత్తం 56 కిలో మీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రాబోతుంది.
ఇవీ చూడండి:1970లో చైనా జీడీపీ మనకంటే తక్కువ: కేసీఆర్