ETV Bharat / briefs

ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. బతుకైనా.. చావైనా నీతోనే అని సినిమా డైలాగ్​లు కొట్టాడు. అవసరం తీరగానే.. పెళ్లికి నిరాకరించాడు. ప్రియుడి మోసాన్ని తెలుసుకున్న ఆ యువతి... మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. అమ్మాయి కాపురాన్ని చెడగొట్టి... విడాకులు తీసుకునేలా చేశాడు. తర్వాత ప్రియురాలికి చావు పరీక్ష పెట్టాడు.

ప్రియురాలికి చావు పరీక్ష
author img

By

Published : Jul 2, 2019, 1:04 PM IST

Updated : Jul 2, 2019, 5:07 PM IST

సుర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన ఎలిజెర్ల సతీశ్​, సరిత గత కొంతకాలం ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడం వల్ల యువకుడి బంధువులు పెళ్లికి నిరాకరించారు. అమ్మాయి తల్లిదండ్రులు వేరొకరితో పెళ్లి జరిపించారు. సజావుగా సాగుతున్న వారి సంసారంలోకి మాజీ ప్రేమికుడొచ్చాడు. ఇద్దరిని ఎలాగైనా విడదీయాలని గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఆమె భర్తకు పంపించాడు. ఇంకేముంది పెళ్లైన నెలరోజులకే... భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. యువతికి జరిగిన అన్యాయాన్ని గమనించిన గ్రామపెద్దలు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మాజీ ప్రేమికుడికి సూచించారు.

ఆ తర్వాత ఇలా జరిగింది..

సీన్ కట్ చేస్తే.. పెద్దల తీర్పు ప్రకారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియురాలి కులం వేరంటూ.. సన్నాయి నొక్కులు నొక్కుతూ.. తప్పించుకునేందుకు ఎత్తులు వేశాడు. అమ్మాయిని అడ్డు తొలగించుకునేందుకు చావు పరీక్ష పెట్టాడు. తనపై ప్రేమ ఉంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని నమ్మించాడు. ప్రియుడి మాటలు నమ్మిన యువతి ముందుగా పురుగుమందు తాగింది. తర్వాత తాను నోట్లో పోసుకున్న ప్రియుడు క్షణాల్లోనే కక్కేశాడు. అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియురాలికి చావు పరీక్ష

ఇవీ చూడండి: ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!

Intro:Slug : TG_NLG_21_01_LOVERS_SUCIDE_ATTEM_AB_C1

TG_NLG_21_01_LOVERS_SUCIDE_ATTEM_a_AB_C1 ( ఫోటో FTP లో సెండ్ చేశాను.)

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , సూర్యాపేట

( ) ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. నీవు లేనిదే బతకలేనన్నాడు. అవసరం తీరగానే పెళ్లికి నిరాకరించి మొహం చాటేశాడు. ప్రియుడి మోసం నుంచి తేరుకున్న
ఆ యువతి మరో యువకుడిని పెళ్లాడింది. ఇంతటితో ముగింపు పలకని ప్రేమికుడు ప్రియురాలి భర్త తో తన వ్యవహారమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇది చాలదన్నట్లు కలిసి తిరిగినప్పటి చిత్రాలను వాట్సాఫ్ లో చేరవేశాడు. ఇతగాడి వికృత చేష్టల తో పెళ్లయిన నెల రోజుల్లోనే ఆ యువతి నుంచి భర్త విడాకులు తీసుకున్నాడు.
గ్రామపెద్దలంతా కలిసి అమ్మాయికి జరిగిన అన్యాయం పై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెద్దల తీర్పు ప్రకారం నేడు పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియురాలి కులం వేరంటూ.. సన్నాయి నొక్కులు నొక్కుతూ.. తప్పించుకునేందుకు ఎత్తులు వేశాడు. బలవంతంగానే పెళ్లికి అంగీకరించిన యువకుడు అడ్డు తొలగించుకునేందుకు ప్రాణాలతో చేలాగాటమాడాడు. తనపై ప్రేమ ఉంటే ఏదైనా చేస్తావా అంటూ.. ప్రియురాలికి పరీక్ష పెట్టాడు. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామంటూ నమ్మించాడు. చావమంటే చేస్తావా అంటూ.. పరీక్ష పెట్టాడు. ప్రియుడి మాటలను విస్వసించిన యువతి ముందుగా పురుగుమందు సేవించింది. ఆ తర్వాత పురుగుమందును నోట్లో పోసుకున్న ప్రియుడు ఒక్క క్షణాల్లోనే వెళ్లగక్కి అక్కడ నుంచి జారుకునేందుకు యత్నించాడు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

వాయిస్ ఓవర్ :

సుర్యాపేట గ్రామీణ టేకుమట్ల గ్రామానికి చెందిన ఎలిజెర్ల సతీష్ , దామెర్ల సరిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు ఇరువురి కులాలు వేరు కావడంతో యువకుడి బంధువులు దళిత యువతితో పెళ్లికి నిరాసక్తత వ్యక్తం చేశారు. అయితే పెద్దలు చెప్పినపుడు వారి మాటలను అనుసరిస్తూ...ఇటు ప్రియురాలితో సానుకూలంగా మాట్లాడుతూ నెట్టుకొస్తున్నారు. ఈ వేసవిలో తనను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టింది. ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్నా...యువకుడిని మనసులోంచి తీసేసి మరో యువకుడిని గత 23న వివాహం చేసుకుంది.

పెళ్లి చేసుకోడు... మరొక్కరితో ఉండనివ్వడు.

ప్రేమించిన యువతి మరో వ్యక్తి తో ఉండడాన్ని జీర్ణించుకోని ప్రియుడు ఎలాగైనా వారిని విడదీయాలని అరాచకాలకు పాల్పడ్డాడు. వివాహం చేసుకొమ్మంటే నిరాకరించిన యువకుడు సతీష్. ప్రియురాలి కాపురంలో నిప్పులు పోశాడు. అమ్మ పెట్టదు.. అడక్కు తిన్నివ్వదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న సతీష్ వ్యవహారం ఇవాల్టీ సంఘటనతో భయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రియురాలు తనను అడ్డుతొలగించుకునేందుకే పథకం వేశాడని గుర్తించింది. తనను కాపాడాలంటూ వేడుకున్నా.. కనీసం దగ్గరకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికులు గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడంతో వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రాధమికంగా తేల్చాయి...బైట్

1. సురిత - బాధితురాలు , టేకుమట్ల.

Body:....

Conclusion:..
Last Updated : Jul 2, 2019, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.