ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మూడు శాసన మండలి స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రులు, వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడు స్థానాలకు 33 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... మొత్తం 814 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫలితాలు 26న వెలువడనున్నాయి.
ఇవీ చదవండి:లక్ష్యం పదహారు.. గెలుపు గుర్రాలకే పెద్దపీట