ETV Bharat / briefs

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ మేటి ఘనత - decentralization of power

ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపుతో 52 మండలాలు కలిగిన ఘనత సొంతం చేసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్​  కేవలం 17 మండలాలతో కొనసాగుతోంది. వచ్చే జూన్‌ మాసం ముగియగానే..ఏ జిల్లాకు ఆ జిల్లా పరిషత్‌ పాలకవర్గాలు ఏర్పడనున్నాయి.

పరిపాలన వికేంద్రీకరణ కోసమే స్థానిక సంస్థలకు రూపకల్పన
author img

By

Published : May 1, 2019, 6:29 AM IST

Updated : May 1, 2019, 7:18 AM IST

దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లో పరిపాలన వికేంద్రీకరణ కోసం స్థానిక సంస్థలకు రూపకల్పన చేశారు. తాలూకాలుగా ఉన్న ఆరోజుల్లో క్షేత్రస్థాయి పట్టుకోసం జిల్లా యూనిట్‌గా ప్రారంభమైన జిల్లా పరిషత్ వ్యవస్థ కాలానుగుణంగా పాలనలో కీలక పాత్ర పోషిస్తోంది‌. జడ్పీఛైర్మన్లుగా పనిచేసిన వారు రాష్ట్ర, జాతీయస్థాయి నేతలుగా ఎదిగారంటే దానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్తే ప్రధాన కారణం.
జాతీయ, రాష్ట్రస్థాయి నేతలుగా ఎదిగిన జడ్పీఛైర్మన్లు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఆదిలాబాద్‌ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. ఘన చరిత్ర కలిగిన ఆదిలాబాద్‌ జిల్లాలో 1959లో జిల్లా పరిషత్‌ ఏర్పడింది. దివంగత మహారాష్ట్ర సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ మామయ్య పల్సికర్‌ రంగారావు తొలి జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండో జడ్పీఛైర్మన్‌గా నిర్మల్‌కు చెందిన పి.నర్సారెడ్డి కొనసాగారు.

ప్రస్తుత రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌ రెడ్డి 1987నుంచి 91 వరకు ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇక్కడ జడ్పీఛైర్మన్లుగా పనిచేసిన మధూసూదన్‌రెడ్డి, రమేశ్ రాఠోడ్‌ కాలక్రమంలో పార్లమెంటు సభ్యులుగా సేవలందించారు.
చరిత్రలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఆదిలాబాద్ జడ్పీ
ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌లో గొప్ప ఐఏఎస్‌ అధికారులు సైతం భాగస్వాములయ్యారు. జడ్పీ ఆవిర్భమైన 1959 నుంచి ప్రస్తుత అధ్యక్షురాలు శోభారాణి వరకు మొత్తం 24 మంది ఛైర్మన్లుగా పనిచేశారు. మరో నలుగురు ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేక అధికారులుగా పనిచేశారు. తొలినాళ్లలో కాంగ్రెస్‌, ఆపై ఎన్టీరామారావు హయంలో తెదేపా, ప్రస్తుతం తెరాస...జడ్పీ పాలన పగ్గాలు చేపడుతూ వచ్చాయి.
ఆదిలాబాద్‌ జడ్పీ సమావేశాల్లో ప్రతి రాజకీయ పార్టీ తన గళం ప్రతిధ్వనించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపుతో 52 మండలాలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్​ ఇప్పుడు కేవలం 17 మండలాలకే పరిమితమైంది.
జూన్ నుంచి కొత్త జడ్పీ పాలకవర్గాలు
జిల్లాల పునర్విభజనలో భాగంగా అఖండా ఆదిలాబాద్‌ జిల్లా...ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న జడ్పీ పాలన వచ్చే జూన్‌ మాసంలో ముగియగానే...ఏ జిల్లాకు ఆ జిల్లా పరిషత్‌ పాలకవర్గాలు ఏర్పడనున్నాయి.
ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్ ఓ మార్గదర్శి
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా బాధ్యతల వికేంద్రీకరణ జరుగుతున్న సమయంలో జిల్లా పరిషత్‌ పాత్ర కీలకమే. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు సాగిస్తూ వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తే...చరిత్రలో సుస్థిరమైన స్థానం దక్కుతుందనడానికి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్ ఓ మార్గదర్శి.

ఇవీ చూడండి : మా పార్టీలో గెల్చి.. ఆపార్టీలోకి ఎలా వెళ్తారు...?

sample description
Last Updated : May 1, 2019, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.