తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి రానున్నారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ శ్రీదేవిని... తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ శ్రీదేవి పెట్టుకున్న వినతికి స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంది.
తెలుగు ఆడపడుచు...
జస్టిస్ శ్రీదేవి ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 1960 అక్టోబర్ 10న జన్మించారు. అఖిల భారత కోటాలో ఉత్తర్‌ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసులో చేరి... 2016లో జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా సేవలందించారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. అనంతరం 2017లో యూపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నవంబరు 22న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇవీ చూడండి: పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు