ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక మంది ఇంటర్ విద్యార్థులు నష్టపోయారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో ఆరోణలు ఉన్నప్పటికీ....వ్యాపార కోణంలోనే గ్లోబరీనా సంస్థకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. గ్లోబరీనా నిర్వాహకం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నష్టపోయిన విషయాన్ని లోక్సభ దృష్టికి తీసుకెళ్లినట్లు సంజయ్ తెలిపారు. ఇంత పెద్ద సంఘటనను.. తెరాస చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గవర్నర్ స్పందించడమే కాదు... బాధ్యులపై చర్యులు తీసుకొని విద్యా వ్యవస్థపై నమ్మకం కల్గించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నరో చెప్పెంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని సంజయ్ హెచ్చరించారు.
ఇవీ చూడండి:'పోలీసు అవినీతి'పై లంచాలు తీసుకుంటూ నిరసన