ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రుల కోసం అవసరమైన గుర్తులను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీ చిహ్నాలనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కేటాయిస్తారు.
ఎంపీటీసీలకు 30, జడ్పీటీసీలకు 60...
రిజర్వ్ సింబల్ లేని 33 పార్టీలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రుల కోసం కూడా ఈసీ గుర్తులను అందుబాటులో ఉంచింది. ఎంపీటీసీ ఎన్నిక కోసం యాపిల్, ఏసీ బెలూన్, బ్యాట్, బెంచ్, బకెట్, క్యాలుక్యులేటర్ తదితర 30 గుర్తులను సిద్ధం చేసింది. జడ్పీటీసీ ఎన్నిక కోసం బీరువా, గాజులు, పండ్లబుట్ట, బాటరీ టార్చ్, బైనాక్యులర్స్, బిస్కట్ తదితర మరో 60 గుర్తులను అందుబాటులో ఉంచింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తై అభ్యర్థుల తుదిజాబితాను ఖరారు చేశాక రిటర్నింగ్ అధికారి గుర్తులను కేటాయిస్తారు.
ఇవీ చూడండి: మెట్రో రైళ్లు నిలిచిపోవడానికి కాలుష్యమే కారణం