అంతర్జాతీయ క్రికెట్లో విభిన్న బౌలింగ్ శైలితో ఆకట్టుకున్న మలింగ.. త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తన చివరి అంతర్జాతీయ టోర్నీ అని చెప్పాడీ క్రికెటర్. ఈ సంవత్సరం జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత 50 ఓవర్ల క్రికెట్కు స్వస్తి పలకుతానని అన్నాడు.
నా క్రికెట్ కెరీర్ అంతిమ దశలో ఉంది. అందుకే 2020లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నాను -లసిత్ మలింగ, శ్రీలంక క్రికెటర్
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ-ట్వంటీ సిరీస్ ఆడుతోంది శ్రీలంక జట్టు. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో 16 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయారు.
పొట్టి ఫార్మాట్లో మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు మలింగ. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో మరో రెండు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలుస్తాడు. ప్రస్తుతం 98 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది.