పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్‌షరీఫ్‌కు లాహోర్ హైకోర్టులో ఊరట లభించింది. అల్ అజీజియా, పనామా పత్రాల కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. షరీఫ్ అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్ మాలిక్ షెహజాద్ అహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ మంజూరుకు అంగీకారం తెలిపింది.
నిజమే గెలిచింది...
లాహోర్ కోట్ లఖ్పేట్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ బెయిల్ మంజూరుపై స్పందించారు.
" నిజమే గెలిచింది. రాజకీయ కుట్రతోనే నాపై అక్రమ కేసులు పెట్టారు. నేను ఒక్క రూపాయైనా అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకంటాను."
- నవాజ్ షరీఫ్, పాక్ మాజీ ప్రధాని