సింగపూర్లో ఉగాది పండుగను తెలుగుప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. శివదుర్గ ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అర్చకులు ఉగాది పచ్చడి చేసి భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా భక్తి శ్రద్ధలతో విన్నారు.
ఇదీ చదవండిః 'షాదీ మాటే వద్దు గురూ- సోలో లైఫే సో బెటరూ'