సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రధాన న్యాయమూర్తిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
పెరిగిన రద్దీ
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేరు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న శ్రీవారిని 63 వేల 548 దర్శించుకున్నారు. 27 వేల 290 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 89 లక్షలు
ఇదీ చదవండి