గొర్రెల పెంపకం, అభివృద్ధిపై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. రాష్ట్రంలో 2019-20 సంవత్సరానికి గాను రెండో విడత గొర్రెల దాణా పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడెం గ్రామంలో ఆయన ప్రారంభించారు. ఇప్పటివరకు గొర్రెల యూనిట్లపై రూ. 3,850 కోట్లు ఖర్చు చేశామన్నారు. రెండో విడత పంపిణీలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు 150 మెట్రిక్ టన్నుల దాణా కేటాయించినట్లు సందీప్‌కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః ఎగ్జిట్ పోల్స్‌తో నిన్న భళా.. అమ్మకాలతో నేడు డీలా