చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుకు పార్లమెంట్లో ఉన్న 37 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైద్రాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 112 కుల సంఘాలు, 28 బీసీ సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ బిల్లును ప్రవేశపెట్టిన వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డిని అభినందించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చి బీసీ ఎంపీలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల