యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఆయన కుమార్తెను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. దీక్షను భగ్నం చేసి దాడులకు పాల్పడితే సహించేది లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ భునిర్వాసితులుగా ఉన్నవారికి సరైన న్యాయం చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముంపు గ్రామాల బాధితులకు మద్దతుగా నిలిచిన నర్సారెడ్డిని ఆయన కూతురిని పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం హేయమన్నారు. భూనిర్వాసితులకు న్యాయం చేయని కేసీఆర్ తన బంధువైన రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు 250 గజాల పట్టా భూమిని ఎలా కేటాయిస్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇవీ చూడండి: డ్రగ్ కేసులో సినీతారలకు క్లీన్చిట్ ఇవ్వలేదు