ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత విధానాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో ఆ 12 మందే మిగులుతారని జోస్యం చెప్పారు. కంటోన్మెంట్ మహేంద్రహిల్స్ కాలనీలో కాంగ్రెస్ నేత ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సంజీవ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిచ్చారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : సీఎల్పీ విలీనంపై ఇవాళ హైకోర్టులో విచారణ