ETV Bharat / briefs

రంజాన్​ పర్వదినం... పరవశించెను రాష్ట్రం

author img

By

Published : Jun 5, 2019, 11:18 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి. అన్ని ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ... ఈద్​ ముబారక్​ చెప్పుకున్నారు. హిందూ స్నేహితులకు ముస్లింలు ప్రత్యేక విందులు ఇచ్చి హిందూముస్లిం భాయీభాయీ అని చాటారు.

ramzan-overall-story

సంతోషంగా ఈద్ ఉల్ ఫితర్...

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదులు, ఈద్గాల వద్ద ఆత్మీయ ఆలింగానాలు... పరస్పరం శుభాకాంక్షలతో సందడి వాతావరణం నెలకొంది. అంతా ఒక్క చోట చేరి సంతోషంగా ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు.

హోంమంత్రి ఇంట పండుగ​ విందు

రంజాన్ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ తన నివాసంలో తెరాస ముఖ్యనేతలు, అధికారులకు ఆతిథ్యమిచ్చారు. హోంమంత్రి విందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేకే, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​తో పాటు... పలువురు ఐఏఎస్​లు, ఐపీఎస్​లు హాజరయ్యారు.

హైదరాబాద్​ మే త్యోహార్​...

రంజాన్ సందర్భంగా భాగ్యనగరంలోని మక్కా మసీద్, మీర్ అలాం దర్గా, యూసుఫ్ గూడలోని ఈద్గాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. హైదరాబాద్​లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరులకు సీపీ అంజనీకుమార్​ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్ని చోట్ల సందడి

ప్రతి జిల్లాలోనూ రంజాన్​ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులు అంతా కలిసి మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విందులు, వినోదాలతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు.

ఇవీ చూడండి: 'చార్మినార్​ నుంచి సనత్​నగర్​ దాకా భిక్షమెత్తుతాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.