ETV Bharat / briefs

ప్రభాస్​-'తానాజీ' దర్శకుడి నుంచి సర్​ప్రైజ్​ - prabhas new film with tanhaji director

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​.. 'తానాజీ' దర్శకుడు ఓమ్​ రౌత్​ కాంబోలో సినిమాపై మంగళవారం ( ఆగస్టు 18) భారీ ప్రకటన రాబోతుంది. దీనిపై సినీప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 'రాధేశ్యామ్'​లో నటిస్తున్నాడు డార్లింగ్​.

prabhas new film
ప్రభాస్
author img

By

Published : Aug 17, 2020, 8:36 PM IST

Updated : Aug 18, 2020, 9:55 AM IST

యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​.. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్​గా మారిపోయాడు. తన తదుపరి సినిమాలన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే తాజాగా బాలీవుడ్​లో 'తానాజీ' తెరకెక్కించిన ఓమ్​ రౌత్​తో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంపై ​ఆగస్టు 18 ఉదయం 7.11గంటలకు ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్​-ఓమ్​రౌత్​ కలిసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను డార్లింగ్​ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. ఈ వీడియోను ఓమ్​రౌత్​తో పాటు ప్రముఖ నిర్మాాణ సంస్థ టీ సిరీస్​కు ట్యాగ్​ చేశాడు ప్రభాస్. దీంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం 'రాధేశ్యామ్'​ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్​. ఆ తర్వాత నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో సైన్స్​ ఫిక్షన్​ సినిమా చేయనున్నాడు.

ఇది చూడండి 'పద్మ విభూషణ్'​ పండిట్​ జస్​రాజ్​ ఇకలేరు

Last Updated : Aug 18, 2020, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.