తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల పంపకాలపై త్వరలో చిక్కుముళ్లు వీడిపోతాయని తెలంగాణ విద్యుత్ సంస్థలు గట్టిగా భావిస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించి బకాయి సమస్యలను పరిష్కరించుకుంటామని ఏపీ విద్యుత్ అధికారులు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు బుధవారం తెలిపారు. తెలంగాణ డిస్కంల నుంచి 5 వేల 700 కోట్ల రూపాయల బకాయిలు రావాలని గతంలో ట్రైబ్యునల్‌లో ఏపీ సంస్థలు పిటీషన్ దాఖలు చేశాయి. తమకు ఏపీ నుంచి రావాల్సిన సొమ్ము 2 వేల 4 వందల కోట్ల వరకు ఉందని.... చర్చించిన తరువాత బకాయిలు చెల్లించాడానికి తాము సిద్దంగా ఉన్నట్లు తెలంగాణ డిస్కంలు అప్పుడే ఏపీకి స్పష్టం చేశాయి.
రూ. 415 కోట్ల రాయితీ విడుదల
ఈ పిటిషన్ బుధవారం విచారణకు రాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమైనందున త్వరలో పరిష్కరం జరిగే అవకాశముందని డిస్కంలు భావిస్తున్నాయి. తదుపరి విచారణను ఈ నెల 31కి ట్రైబ్యునల్ వాయిదా వేసింది. బకాయిల అంశంపై చర్చించేందుకు ఏపీ విద్యుత్ సంస్థల ఉన్నాతాధికారులు నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక విద్యుత్ రాయితీల కింద జులై నెలకు 4 వందల 15 కోట్ల రూపాయలను రాష్ట్ర డిస్కంలకు విడుదల చేస్తూ... తెలంగాణ ఇంధనశాఖ బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది.
తగ్గిన విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో వాతావరణం చల్లబడడంతో విద్యుత్ డిమాండ్ బాగా తగ్గింది. బుధవారం గరిష్ఠ డిమాండు 6 వేల 820 మెగావాట్లు ఉంది. గతేడాది ఇదే రోజు 7వేల 671 మెగావాట్లు ఉంది.
ఇవీ చూడండి: "ప్రవేశాలలోపు రుసుములు ఖరారు చెయ్యండి"