ETV Bharat / briefs

డేటా ఎక్కడిది? - ఆంధ్రప్రదేశ్​

డేటా చోరీ చేశారంటూ వైకాపా ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్​ వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు మండిపడ్డారు. ఫిర్యాదుదారుడిని బెదిరించిన కేసులో కేపీహెచ్​బీ ఠాణాలో ఏపీ పోలీసులపై కేసు కూడా నమోదైంది.

ఐటీ గ్రిడ్​కు అంత సమాచారం ఎక్కడిది
author img

By

Published : Mar 5, 2019, 12:01 AM IST

Updated : Mar 5, 2019, 3:11 AM IST

ఐటీ గ్రిడ్ సంస్థ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి హార్డ్​డిస్క్​లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్​పై కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తునకు ఏపీ పోలీసులు ఆటంకం కలిగించేలా వ్యవరించారని పోలీసులు ఆక్షేపించారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డిని బెదిరించిన కేసులో కేపీహెచ్​బీ ఠాణాలో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది.

ఏపీ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేవామిత్ర యాప్​లో పొందుపరుస్తున్నారని తుమ్మల లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్​ సంస్థపై కేసు నమోదు చేశారు. ఆ సంస్థ నలుగురు ఉద్యోగులను పోలీసులు విచారించారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు...స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, ల్యాప్​టాప్ లను విశ్లేషించి.. ఐటీ గ్రిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధరించుకున్నారు.

ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఏ పార్టీకి ఓటేయనున్నారనే సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థ వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఐటీ గ్రిడ్ సంస్థ తెదేపాకు సేవా మిత్ర అనే యాప్​ను రూపొందించి... అందులో ఈ సమాచారాన్ని పొందుపర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఐటీ గ్రిడ్​కు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు.

వైజాగ్​కు చెందిన బ్లూఫ్రాగ్ అనే సాఫ్ట్​వేర్ సంస్థకు, ఐటీ గ్రిడ్​కు వ్యాపార సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్​ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు అధీనంలో ఉంచుకున్నారు. సమాచారాన్ని భద్రపర్చినందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖలు రాశారు. సీజ్ చేసిన హార్డ్​డిస్క్​ను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఎప్పటి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అనుబంధ సంస్థలేమైనా ఉన్నాయా అనే వివరాల కోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్​కు లేఖ రాయాలని నిర్ణయించారు పోలీసులు .

undefined

Intro:Body:

వైజాగ్​కు చెందిన బ్లూఫ్రాగ్ అనే సాఫ్ట్​వేర్ సంస్థకు, ఐటీ గ్రిడ్​కు వ్యాపార సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్​ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు అధీనంలో ఉంచుకున్నారు. సమాచారాన్ని భద్రపర్చినందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకు లేఖలు రాశారు. సీజ్ చేసిన హార్డ్​డిస్క్​ను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఎప్పటి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అనుబంధ సంస్థలేమైనా ఉన్నాయా అనే వివరాల కోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్​కు లేఖ రాయాలని నిర్ణయించారు పోలీసులు . 

Conclusion:
Last Updated : Mar 5, 2019, 3:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.