ETV Bharat / briefs

'ఫొని' మోత... రైల్వే ప్రయాణికుల ఇక్కట్ల కూత - PHONY_CYCLONE_EFECT_ON_RAILWAYS

ఫొని తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్​ సహా పొరుగు రాష్ట్రాల్లో తీవ్ర రూపం దాల్చిన ఫొని ఇప్పటికే చాలా నష్టం కలగజేసింది. ఇప్పుడు ఈ తుపాను ప్రభావం రైల్వే శాఖపై పడింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈనెల 2 నుంచి 8 వరకు సుమారు 100 రైళ్లను రద్దు చేశారు. వాతావరణ పరిస్థితులు సద్ధుమణిగే వరకూ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిందేనంటున్నారు అధికారులు.

రైల్వేశాఖపై ప్రభావం...
author img

By

Published : May 5, 2019, 12:17 AM IST

ఫొని తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే ఈ నెల 2 న 30 రైళ్లను, 3 న 32 , 4న 24 రద్దు చేసిన రైల్వే శాఖ... 5న 8, 6 న 3రైళ్లను, 7న రెండింటిని, 8న ఒక రైలు సేవలను నిలిపేసినట్లు తెలిపింది. నాలుగింటి సేవలను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు... 4 రైళ్లను దారి మళ్లించారు. ఈ మార్పులతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. రైళ్ల రద్దు వివరాలు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేశామని రైల్వే అధికారులు తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లలో విపత్తుల నిర్వహణ అధికారులను ఏర్పాటు చేశామని... ప్రయాణికులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

అయితే... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఫొని ప్రభావం పెద్దగా చూపలేదన్న రైల్వే అధికారులు.... డివిజన్ల ప్రభావంతోనే రైళ్లను రద్దు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టే సేవలు కొనసాగిస్తున్నామని తెలుపుతున్నారు. వాతావరణం చక్కదిద్దుకున్నాకే రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.

రైల్వేశాఖపై ప్రభావం...

ఇవీ చూడండి: పది ఫలితాలు ఆలస్యం.. అదనపు జాగ్రత్తలే కారణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.