ETV Bharat / briefs

"ప్రజలు సరైన వారినే ఎన్నుకుంటారు"

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సరైన వారినే ఎన్నుకుంటారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. విపత్తుకు దారితీసే మహాకూటమిని కాకుండా స్థిరత్వం గల ప్రభుత్వానికే మొగ్గు చూపుతారని తన బ్లాగ్​లో పేర్కొన్నారు.

అరుణ్​ జైట్లీ
author img

By

Published : Mar 18, 2019, 5:01 AM IST

ప్రతిపక్షాల మహాకూటమిపై ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. విపత్తుకు దారితీసే కూటమిని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆదరించబోరని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన రాజకీయ నేతలు, పార్టీలతో ఏర్పడిన ప్రతిపక్షాల మహాకూటమి రాజకీయ అస్థిరత్వానికి మాత్రమే హామీ ఇస్తుందని తన ​అజెండా-2019 బ్లాగ్​లో పేర్కొన్నారు.

  • At the cusp of history, India and Indians have a choice to make. Are they electing a 6 month govt or a 5 year govt? Are they choosing between a tested & performing leader or a chaotic crowd of non-leaders? I am confident aspirational people of India will make the right choice.

    — Chowkidar Arun Jaitley (@arunjaitley) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" చరిత్రను పరిశీలించి, భారతీయులు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆరు నెలలు ఉండే ప్రభుత్వాన్ని ఎంచుకుందామా? లేదా ఐదేళ్ల ప్రభుత్వాన్నా అని?... నిరూపించుకున్న, సత్తాగల నాయకుడినా లేకా గందరగోళ గుంపులోని నాయకుడినా.. ఎవరిని ఎన్నుకోవాలా అని?" - జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

" ప్రజలు ఎన్నుకునేది వృద్ధిని పెంచే, అభివృద్ధి చేసే, పేదరిక నిర్మూలన చేసే ప్రభుత్వాన్నా... లేకా సొంత ప్రగతిని చూసుకునే వారినా...? దేశ ప్రజలు సరైన ఎంపికనే ఎంచుకుంటారని నేను నమ్ముతున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించాలనే లక్ష్యంతోనే మహా కూటమి ఏర్పాటైంది. అది విపత్తుకు దారి. అది కిందిస్థాయి పోటీ. "- జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ప్రధాని అభ్యర్థిపై పోరు

  • The Mahamilawat Mahagathbandhan unquestionably promises political instability. Past reveals that such non-ideological alliances have only lasted for a few months. In absence of policy, this gathbandhan is a potential recipe for causing irreparable damage to India & Indians.

మహాకూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థిపై టగ్​ ఆఫ్​ వార్​ ఉంటుందని అన్నారు జైట్లీ. అందులో కాంగ్రెస్​, బీఎస్పీ, ఎస్పీ, టీఎంసీ, టీడీపీ నేతలు ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్నారని పేర్కొన్నారు.

" వారిలో నలుగురు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అందులో రాహుల్​ గాంధీ, మాయావతి, మమత , శరద్​ పవర్ ఉన్నారు​. తమకు పోటీ ఉన్న వ్యక్తుల బలాన్ని తగ్గించి వారి వారి బలాన్ని చూపించాలనే కోరికగా ఉన్నారు." - జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

సిద్ధాంతాలు లేని కూటములు నిలువలేవు

  • The Mahamilawat Gathbandhan 'Mahagathbandhan' is a road to disaster. It is a race to the bottom having a tug of war on the issue of leader. Four people have clearly indicated their desire to be PM - Shri Rahul Gandhi, Behan Mayawati, Mamata Didi & Shri Sharad Pawar.

ఎలాంటి సిద్ధాంతాలు లేని కూటములు కొన్ని నెలల్లోనే కూలిపోతాయని అన్నారు జైట్లీ. చౌదురి చరణ్​ సింగ్​, వీపీ సింగ్​, చంద్ర శేఖర్​, హెచ్​డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్​ నేతృత్వంలోని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పాలించలేకపోయాయని గుర్తుచేశారు.

" రాజకీయ అస్థిర వాతావరణం ఉంటే భారత్​లో ఎవరు పెట్టుబడులు పెట్టాలనుకుంటారు? భారత పెట్టుబడిదారులు సైతం బయటిదేశాలకు వెళ్లాలనుకుంటారు. స్థిర ప్రభుత్వం గల దేశాల వైపు చూస్తారు. ఎక్కడైతే అస్థిరత్వం ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది" - జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.