ETV Bharat / briefs

జబ్బు చేసిందా.. ఇక ఇంట్లోనే చికిత్స

వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఆసుపత్రికి రాలేని వారికి ఇంటికి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. తొలిదశలో యాదాద్రి భువనగిరితోపాటు రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని 152 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

author img

By

Published : May 5, 2019, 7:36 PM IST

ఇంట్లోనే చికిత్స

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని సామాజిక ఆసుపత్రిలో వయోవృద్ధుల ఆరోగ్యసంరక్షణ కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్యకేంద్రాలకు రాలేనివారి కోసం వైద్యసిబ్బంది ఇంటికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం ప్యాలియేటివ్ కేంద్రాలు, 104 సంచార వాహనాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను వినియోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఈ తరహా సేవలు మొదలుపెట్టారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం ఆధారంగా వైద్యాధికారులు అవసరమైన వారికి పరీక్షలు చేసి ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు.

నెలకోసారి పరీక్ష..

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రతీ గురువారం వయోవృద్ధులకు ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రికి రాలేని వారికి ఆరోగ్య కార్యకర్త, 104 సిబ్బంది ఫిజియోథెరపిస్టు, ఫార్మసిస్టు బృందం కనీసం నెలకు ఒకసారి వెళ్లి సేవలందించే ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే 600 మందికి పైగా చికిత్స...

ఇప్పటివరకు 600 మందికి పైగా పరీక్షలు నిర్వహించి.. వైద్యసేవలు అందించామని చౌటుప్పల్ పాలియేటివ్ కేంద్రం ఇంఛార్జీ డాక్టర్ కాటంరాజు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రిలో చేర్చి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

రోగుల ఆనందం..

క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అన్నిరకాల వైద్యసేవలతో పాటు మందులు, భోజనం అందిస్తున్నారు. జబ్బు నయం అయిన తర్వాత ఆసుపత్రి వాహనంలోనే వారిని ఇంటికి పంపిస్తున్నారు. రోగులు తమకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జమ్ముకశ్మీర్ వైద్య బృందం కితాబు..

వయోవృద్ధుల ఆరోగ్య వివరాలను వారి వ్యక్తిగత కార్డుల్లో పొందుపరుస్తున్నారు. ఈ వివరాలన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి.. 30ఏళ్లు పైబడిన వారందరి ఆరోగ్య నివేదిక తయారు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జమ్ముకశ్మీర్ వైద్యుల బృందం ఈ ప్యాలియేటివ్ కేంద్రాన్ని సందర్శించి.. ఇక్కడ అందిస్తున్న సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.

ఇంట్లోనే చికిత్స

ఇవీ చూడండి: తగ్గిన వర్షపాతం... అడుగంటిన భూగర్భజలం..

Intro:స్టొరీ కి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు

Body:స్టొరీ కి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు

Conclusion:స్టొరీ కి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.