హైదరాబాద్ వనస్థలీపురంలోని అనాథ విద్యార్థుల గృహంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనాథ, నిరుపేద విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ , ఇతర కోర్సులు చదువుతున్న వారి నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని అనాథ విద్యార్థి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్ తెలిపారు. ప్రవేశాల కోసం అనాథ ధ్రువీకరణ, ఆర్థిక, చదువుకు సంబంధించిన పత్రాలను దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. జూన్ ఐదోతేదీలోగా వనస్థలీపురంలోని కార్యాలయంలో అందించాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, బస్పాస్, వైద్యఖర్చులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండి: అభిమానుల మనసు గెలిచిన మెగా హీరో