హైదరాబాద్ పాతబస్తీలో నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు... ప్రస్తుతం అపహరణ కేసుగా మార్చినట్లు వివరించారు. ఒమన్ దేశానికి చెందిన రూబినా బేగం తన కూతురు డబ్బులు, బంగారం తీసుకుని... అతిఖ్ అనే వ్యక్తితో కలిసి పారిపోయిందని ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అమ్మాయి... వయసు ధ్రువీకరణ పత్రాలు లభ్యమయ్యాయి. 18 ఏళ్ల కంటే తక్కువ వుండటంతో అపహరణ కేసుకు మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి