మేడ్చల్ పారిశ్రామికవాడలోని విత్తనాల పరిశ్రమపై చైల్డ్ ప్రొటెక్షన్, షీటీం, కార్మిక శాఖ అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రసాద్ విత్తన పరిశ్రమలో పని చేస్తున్న 30 మంది బాల కార్మికులను గుర్తించారు. సీడబ్ల్యూసీ సభ్యులు వెంకటేశ్వర్లు, బీబీఏ చందన, స్మైల్, షీ టీం సభ్యులు చిన్నారులను రెస్క్యూ చేశారు.
సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని షెల్టర్‌కు తరలించారు. ఈ మేరకు బాల కార్మికులకు రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యురాలు రాగజ్యోతి కౌన్సిలింగ్ ఇచ్చారు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.