సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి సెల్లార్లోకి దూకి దినేష్ అనే నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వద్ద ఆధార్ కార్డు, సంస్థ రిసీప్ట్ను గుర్తించారు. రోహన్భాయ్ దినేష్ భాయ్ పేరుతో గుర్తింపు కార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి : అనుమానాస్పద స్థితిలో సెక్యూరిటీ గార్డు మృతి