ETV Bharat / briefs

ఇప్పటి వరకూ ఒక్కటి లేదు..

లోక్​సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైనా.. మహబూబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గానికి ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరూ కూడా నామపత్రాలు దాఖలు చేయలేదు.

author img

By

Published : Mar 20, 2019, 6:04 AM IST

Updated : Mar 20, 2019, 7:51 AM IST

నామపత్రాలు

లోక్​సభ ఎన్నికలకు ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు నామపత్రాలు దాఖలు కాలేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. తెరాస, భాజపాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. 18వ తేదీ ద్వాదశి కావటం, 19న మంగళవారం కావటం వల్ల స్వతంత్రులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ కూడా నామపత్రాలు దాఖలు చేయలేదు.

లోక్​సభ ఎన్నికలకు ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు నామపత్రాలు దాఖలు కాలేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. తెరాస, భాజపాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. 18వ తేదీ ద్వాదశి కావటం, 19న మంగళవారం కావటం వల్ల స్వతంత్రులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ కూడా నామపత్రాలు దాఖలు చేయలేదు.

నామపత్రాల ఊసే లేదు

ఇవీ చూడండి:తెరాస తీర్ధం పుచ్చుకున్న నేతలపై రేవంత్​ ఆగ్రహం

Intro:TG_WGL_27_18_MLC_POOJALU_AB_G1
.................
శాసన మండలి సభ్యురాలు గా ఎన్నికైన సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గానికి వచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమె మొదటిసారిగా కురవి కి రావడం తో ఆమెకు తెరాస కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె అమరవీరుల స్మారక చిహ్నానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కవిత, కోరం కనకయ్య తో కలిసి కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం వారిని ఆహ్వానించారు. భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తొలి గిరిజన మహిళగా తనకు సీఎం కేసీఆర్ ర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించడానికి సైనికురాలి వలె పని చేస్తానన్నారు. ప్రతి ఇంటి పై గులాబీ జెండా ఎగరవేసి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తాం అన్నారు.రెడ్యా నాయక్ మాట్లాడుతూ సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ ర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.
బైట్స్......
1. సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ
2. రెడ్యా నాయక్ ఎమ్మెల్యే డోర్నకల్
3. శంకర్ నాయక్ ఎమ్మెల్యే మహబూబాబాద్


Body:కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పూజలు


Conclusion:8008574820
Last Updated : Mar 20, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.