తెరాస తరఫున గెలిచిన నూతన ఎంపీలు, నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెరాస నుంచి 9మంది ఎంపీలు గెలుపొందారు. గెలిచిన ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతలు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పాలమూరు తెరాసలో అంతర్మథనం