ETV Bharat / briefs

కరోనాకు చెక్​ పెట్టే ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్ రూ.33కే!

ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 బాధితులు వైరస్ నుంచి వేగంగా కోలుకునేందుకు దోహదపడుతున్న ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్ ఇప్పుడు మరింత చౌక ధరకు మార్కెట్లోకి వచ్చేసింది. కేవలం రూ.33కే విడుదల చేసి రికార్డు సృష్టించింది ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌.

MSN Lab announces cheapest favipiravir COVID-19 drug  at Rs 33 per tablet | In-depth - Times of India Videos
కరోనాకు చెక్ పెట్టే ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్ ఇప్పుడు రూ.33కే!
author img

By

Published : Aug 14, 2020, 6:37 AM IST

Updated : Aug 14, 2020, 6:43 AM IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా కంపెనీ ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ తక్కువ ధరలో 'ఫావిపిరవిర్‌' ట్యాబ్లెట్‌ (200 ఎంజీ)ను తీసుకువచ్చింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.33. ఇంత వరకు దాదాపు పది కంపెనీలు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేశాయి. వీటన్నింటిలో ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ట్యాట్లెట్‌ ధరే తక్కువ. 'ఫావిలో' అనే బ్రాండు పేరుతో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్‌ను విడుదల చేసినట్లు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ వెల్లడించింది.

సొంత పరిశోధన- అభివృద్ధి ద్వారా ఈ ఔషధం ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌)తో పాటు, ఫార్ములేషన్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 బాధితులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ‘ఫావిపిరవిర్‌’ ట్యాబ్లెట్‌ను అందించటం ద్వారా ప్రజలకు అండగా నిలిచే అవకాశం తమకు దక్కినట్లు భావిస్తున్నామని ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కొవిడ్‌-19 చికిత్సలో ఉపయోగపడే యాంటీ- వైరల్‌ ఔషధం ఒసెల్టామివిర్‌ 75 ఎంజీ ట్యాబ్లెట్‌ను 'ఓస్‌లో' అనే బ్రాండు పేరుతో ఇటీవల విడుదల చేసినట్లు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ పేర్కొంది. అంతేగాక ప్రస్తుతం తీసుకువచ్చిన ఫావిపిరవిర్‌ 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు అదనంగా త్వరలో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: అటవీశాఖ అధికారుల వాహనాన్ని వెంబడించిన గజరాజు

Last Updated : Aug 14, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.