వనపర్తిలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా పట్టణ శివారులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పార్కులు వ్యాయామ సంబంధిత పరికరాలను ప్రారంభించారు. అనంతరం శ్వేతనగర్ కాలనీలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే 14 వందల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఖిల్లా గణపురం మండలం కర్ణ తండాలో 100 గృహాల నిర్మాణం పూరైందని... వచ్చే వారంలో వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తికి సంబంధించి 560 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి