సర్పంచులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో స్థానిక శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సర్పంచులు, ఉప సర్పంచులు గ్రామాల్లోనే ఉంటూ.. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్, వార్డు మెంబర్లపై ఉందని ఎర్రబెల్లి అన్నారు. దేవాదుల, ఎస్సారెస్పీ పనులను వేగవంతం చేస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నెలలో రైతులకు నీరు అందిస్తామన్నారు. గతంలో లేని విధంగా సర్పంచులకు చెక్ పవర్ వెసులుబాటు కల్పించామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని ఆకాక్షించారు.
ఇవీ చూడండి: పదివి కోసం ఎత్తుగడనా... పార్టీ మారే సంకేతాలా...?