ETV Bharat / briefs

ప్రాదేశిక తీర్పు రేపే వెలువడనుంది! - స్థానిక సంస్థల తీర్పు

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జడ్పీటీసీ స్థానాలకు 2,426 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18, 930 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 21వేల 356 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది.

ప్రాదేశిక తీర్పు రేపే వెలువడనుంది!
author img

By

Published : Jun 3, 2019, 2:50 PM IST

ప్రాదేశిక తీర్పు రేపే వెలువడనుంది!

మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. గత నెల 6, 10, 14న మూడు విడతల్లో జరిగిన పోలింగ్​కు సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. రాష్ట్రంలోని 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 4 జడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

ఎనిమిది గంటలకే ప్రారంభం

రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 123 కేంద్రాలను ఎస్​ఈసీ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో మొత్తం 978 హాళ్లను ఏర్పాటు చేశారు. దాదాపుగా 35 వేలకు పైగా సిబ్బంది లెక్కింపులో పాల్గొననున్నారు. ఇందులో 11 వేల 882 మంది సూపర్ వైజర్లు, 23 వేల 647 మంది సహాయకులు ఉంటారు.

మొదట ఎంపీటీసీ... తర్వాతే జడ్పీటీసీ

ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక రౌండ్​లో వెయ్యి చొప్పున ఓట్లు లెక్కిస్తారు. మొదట బాక్సుల్లోని ఓట్లను తెరచి 25 చొప్పున కట్టలుగా కడతారు. మొదట ఎంపీటీసీ ఓట్లు, అనంతరం జడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు.

తుది నిర్ణయం వారిదే

అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా... మధ్యాహ్నానికి ఫలితాలకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశముంది. సాయంత్రం ఐదు గంటల లోపు లెక్కింపు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి : వస్త్రధారణపై ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.