కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా... వాారికి కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వాహన వేగాన్ని అదుపులో ఉంచుకుని... ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతామన్నారు.
ఇదీ చూడండి: కర్నూలులో ప్రమాదం... రాష్ట్రానికి చెందిన 15 మంది మృతి