గత నెల 16న కరీంనగర్లో ప్రచార భేరీ మోగించిన కేసీఆర్.. 19న నిజామాబాద్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ఖరారు ప్రక్రియ, వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అనంతరం 29న మలిదశ ప్రచారం ప్రారంభించి పది నియోజకవర్గాల్లో పది సభల్లో పాల్గొన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, మెదక్, జహీరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.
తుది విడత ప్రచారం
నేడు, రేపు కేసీఆర్ ప్రచార కార్యక్రమాలేవీ లేవు. ఈనెల 7 నుంచి తుది విడత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 7న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సభ నిర్మల్లో.. ఈనెల 8న చేవెళ్ల సభ వికారాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఈనెల 9న ప్రచార సభ నిర్వహించాలని నేతలు కోరారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.