ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరంను జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మేడిగడ్డకు చేరుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, ఎమ్మెల్యేలు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న సీఎం కుటుంబ సభ్యులు. అనంతరం తెలుగు రాష్ట్రాల, మహారాష్ట్ర గవర్నర్లు, ముఖ్యమంత్రులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఇవీ చూడండి:మహత్తర ఘట్టానికి ఘనమైన ఏర్పాట్లు