ఎవరు అడగకుండానే ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్‌లో స్పష్టం చేశారు. భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాలను మూడు, నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపడానికే ఈప్రాంతాన్ని నాలుగు జిల్లాలుగా చేశామని స్పష్టం చేశారు
మహబూబాబాద్‌లో సభ ముగించుకుని... ఖమ్మం సభకు చేరుకున్న కేసీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుంటామని తెలిపారు. దేశంలో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవని విబేధాలు లేకుండా తెరాస నేతలందరూ ఒక్కటై 16మంది ఎంపీలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు గులాబీ బాస్.
ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు. సుబాబుల్ రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:రసాభాసగా కురుమ సంఘం నాయకుడి సన్మాన సభ