ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులు హిందువులు, ముస్లింల గురించి మాట్లాడతారా అంటూ వికారాబాద్ తెరాస బహిరంగ సభలో కేసీఆర్ ధ్వజమెత్తారు. తెరాసకు కులం, మతం లేకుండా పరిపాలిస్తోందని స్పష్టం చేశారు. దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గ కుటిలనీతి మంచిది కాదని మండిపడ్డారు. దేశ సంపద పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి 2001 నుంచి ఉద్యమకారుడు... పదిమందికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్న వ్యక్తని పేర్కొన్నారు. స్వార్ధ కోసం రాజకీయాలకు రావాట్లేదని ప్రజలకు సేవలందించడానికి వస్తున్నారని వెల్లడించారు. సాగునీరు, పట్టభూములు, రైతులను కాపాడే బాధ్యత తనదని గులాబీ అధినేత హామీనిచ్చారు.
సాగునీరు, పట్టభూములు అందించే బాధ్యత నాదే: కేసీఆర్ - సాగునీరు, పట్టభూములు అందించే బాధ్యత నాదే: కేసీఆర్
వికారాబాద్ జిల్లా చేవెళ్లలో తెరాస బహిరంగ సభకు గులాబీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సాగునీరు, పట్టభూముల సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు.