తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం కోసం ఆరు నెలల కాంట్రాక్టు కింద వెయ్యి మందికి పైగా కాంట్రాక్టు అప్టోమ్స్లను ఉద్యోగాలకు తీసుకుంది. ప్రాజెక్టు పూర్తవ్వగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి తీసుకుంటామని చెప్పి ఇప్పుడు అన్యాయంగా తమను తొలగించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల్లో కోటి యాభై లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 18 లక్షల 4 వేల మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : మృత్యువుకు తలొగ్గిన చిన్నారి ఫతేవీర్