ETV Bharat / briefs

శరవేగంగా కాళేశ్వరం: జల లక్ష్యానికి చేరువలో తెలంగాణ - KCR

వృథాగా పోతున్న నీళ్లను సాగుకు, తాగుకు మళ్లించాలి. తెలంగాణ ఏర్పడిన లక్ష్యం నేరవేరాలంటే... రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టాలి. ఇది సీఎం కేసీఆర్ ఆలోచన. తాగు నీటి కోసం మిషన్ భగీరథ, సాగు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి... ఇవీ అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలు.

జల లక్ష్యానికి చేరువలో తెలంగాణ
author img

By

Published : Jun 2, 2019, 7:03 AM IST

Updated : Jun 2, 2019, 7:13 AM IST

జల లక్ష్యానికి చేరువలో తెలంగాణ

తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీటి రంగానికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసింది. బడ్జెట్​లోనూ అధిక నిధులు కేటాయించింది. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు కేసీఆర్... అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల డిజైన్లను మార్చేశారు. బహుళ ప్రయోజనాల దృష్ట్యా.... కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల్ని వేగవంతం చేశారు. నిర్మాణంలో రికార్డులు తిరగరాసుకుంటూ దేశం దృష్టిని ఆకర్షించింది కాళేశ్వరం.

ఏడాదిలోపే..

ఇంజినీరింగ్ సవాళ్ల​తో కూడుకున్న ఈ ప్రాజెక్టు... ఇటీవల వెట్​రన్​లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. పూర్తి భారతీయ సాంకేతికతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలను ఈ ఏడాదిలోనే రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలైలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి జలాశయాలకు తరలించి అక్కణ్నుంచి చెరువులు, పంట పొలాలకు నీరిచ్చేలా పనుల్ని వేగవంతం చేసింది.

43 వేల కోట్లతో..

రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పేరుతో అతి పెద్ద తాగునీటి పథకాన్ని ప్రారంభించారు కేసీఆర్. ఎన్నికల ప్రణాళికలో చెప్పకపోయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా తాగునీరు సమస్యతో బాధపడకూడదనే లక్ష్యంతో మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. రూ.43,791 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి: అంబులెన్స్​కు దారిచ్చిన గవర్నర్​ నరసింహన్​

Intro:Body:Conclusion:
Last Updated : Jun 2, 2019, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.