ETV Bharat / briefs

కాళేశ్వరం కల సాకారమైన వేళ..! - godavari

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులెత్తించారు. ఇందుకోసం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. ఆనకట్టలు, కాల్వలు, సొరంగాలు ఇలా పనులన్నీ ఏకకాలంలోనే శరవేగంగా ముందుకు సాగాయి. రెండేళ్లలోనే ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది.

కాళేశ్వరం కల సాకారమైన వేళ
author img

By

Published : Jun 20, 2019, 9:14 AM IST

కాళేశ్వరం కల సాకారమైన వేళ

కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016 మే రెండో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మహారాష్ట్రతో అంతర్ రాష్ట్రాల జల ఒప్పందం నేపథ్యంలో ప్రాజెక్టు పనులకు ఎలాంటి అవాంతరం లేకుండా పోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ సమీపంలోని అంబట్ పల్లి వద్ద ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదికి అడ్డంగా 1.632 కిలోమీటర్ల మేర ఆనకట్ట నిర్మిస్తున్నారు. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా వంద మీటర్ల ఎత్తు ఉండేలా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు.
1,849కోట్లా 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆనకట్టకు 85 గేట్లను బిగిస్తారు. మేడిగడ్డ జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 16.17టీఎంసీలు. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణంతో దిగువకు పోయే గోదావరి జలాలను నదిలోనే నిల్వ చేస్తారు. ఆనకట్టకు సంబంధించిన సివిల్ పనులు, గేట్ల ఏర్పాటు దాదాపుగా పూర్తైంది. నదిలో నీరు నిల్వ చేసేందుకు వీలుగా రెండు ఒడ్డుల్లో లైనింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. వర్షాలు కురిస్తే గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా వెళ్లకుండా జలాశయంలో నిల్వ చేసేందుకు మార్గం సుగమమైంది. మేడిగడ్డలో నిల్వ చేసే గోదావరి జలాలను ఎగువకు తరలించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆనకట్టల పనులు పూర్తి కాగా... పంప్ హౌస్​లు సిద్ధమయ్యాయి.
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్​కు నీటిని ఎత్తిపోసేందుకు మార్గం సుగమమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ జలాశయంలో నిల్వ చేసే నీటిని దశల వారీగా ఎగువకు ఎత్తిపోస్తారు. మొదటిదశలో మేడిగడ్డలో నిల్వ చేసిన గోదావరి జలాలను కన్నేపల్లి పంప్ హౌస్​ ద్వారా ఎత్తిపోస్తారు. 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 17 పంపులను రెండు దశల్లో ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలోని 11 పంపులకు గాను ఇప్పటికే 9 పంపులు సిద్ధమయ్యాయి. రెండో దశకు చెందిన సివిల్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ పంపులన్నింటినీ ఆస్ట్రియా దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాబోవని ఇంజినీర్లు చెప్తున్నారు.
కన్నేపల్లి పంప్ హౌజ్ ద్వారా ఎత్తిపోసే జలాలను తరలించేందుకు ప్రత్యేకంగా గురుత్వాకర్షణ కాల్వను నిర్మించారు. కన్నేపల్లి నుంచి అన్నారం వరకు 13 కిలోమీటర్లకు పైగా కాల్వ అటవీ ప్రాంతంలో ఉంది. కాల్వ పనుల్లో భాగంగా 11 వంతెనలను నిర్మించారు. మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం ఆనకట్ట పనులూ పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే పనులు పూర్తి చేశారు. గోదావరి నదిలో 1.216 కిలోమీటర్ల పొడవున 119 మీటర్ల ఎత్తుతో ఈ ఆనకట్టను నిర్మించారు. దీని నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ఇక్కడ 66 గేట్లు ఏర్పాటు చేశారు.
వరుస ఆనకట్టల్లో భాగంగా అన్నారం ఎగువన సుందిళ్ల వద్ద మరో ఆనకట్ట నిర్మించారు. 129 మీటర్ల ఎత్తుతో గోదావరి నదిపై 1.312 కిలోమీటర్ల పొడవున ఆనకట్ట నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఆనకట్టకు 74 గేట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నీటి నిల్వ సామర్థ్యం 7.24 టీఎంసీలు. అన్నారం, సుందిళ్ల జలాశయాల్లో నిల్వ చేసే గోదావరి జలాలను ఎగువకు ఎత్తిపోసేందుకు నిర్మించిన పంపుహౌస్​లు కూడా సిద్ధమయ్యాయి. ఒక్కో చోట 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు పంపుల చొప్పున పనులు పూర్తి చేశారు. ఇక్కణ్నుంచి నీటిని ఎగువకు ఎత్తిపోసి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్​లోకి తరలిస్తారు.
వాస్తవానికి రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి జలాలను ఎత్తిపోయాలని భావించారు. అయితే సివిల్ పనులను మాత్రం మూడు టీఎంసీల సామర్థ్యానికి అనుగుణంగా చేపట్టారు. తాజాగా మూడో టీఎంసీకి సంబంధించిన పనులను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కన్నేపల్లి, అన్నారం, గోలివాడ పంప్ హౌస్​ల వద్ద మూడో టీఎంసీకి సంబంధించిన పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి: పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్న గోదారమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.