ఇంత జరుగుతున్నా పర్యటకులు మాత్రం తుపానుకు ఏమాత్రం భయపడకుండా వాతావరణాన్ని అస్వాదిస్తున్నారు. ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. వారి రద్దీ ఏ మాత్రం తగ్గలేదు కాలిఫోర్నియా నగరానికి.
వాతావరణం చాలా దారుణంగా ఉన్నా , చాలా బాగుంది. ఈ రోజు సూర్యుడు వస్తే ఇంకా బాగుండేది- చున్-య-జంగ్, పర్యటకుడు
సుమారు వారం రోజుల నుంచి కాలిఫోర్నియాపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం శీతాకాలం ఇక్కడ పొడి వాతావరణం ఉండేది. ఈసారి తుపాను ధాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
213 కిలోమీటర్ల వేగంతో గాలులు
తుపాను ప్రభావం వల్ల 213 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినట్లు జాతీయ వాతావరణ సంస్థ ప్రకటించింది. తుపానుకు మంచు కూడా తోడవడం వల్ల పరిస్థితి దారుణంగా మారింది.
తుపాను వల్ల భారీగానే నష్టం సంభవించినట్లు షెరిఫ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. రవాణ వ్యవస్థ దెబ్బతింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తాయని ఫెడరల్ ఏవియేషన్ ప్రకటన విడుదల చేసింది.