రాజస్థాన్ - హైదరాబాద్... రెండు జట్లూ ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించాయి. మన్కడింగ్‌తో బట్లర్ వికెట్ కోల్పోయి మ్యాచ్ చేజార్చుకున్న జట్టు ఒకటైతే, ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పరాజయం చెందిన జట్టు మరొకటి. హైదరాబాద్ వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
కోల్‌కతాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 53 బంతుల్లో 85 పరుగులు చేసి పునరాగమనంలో అదరగొట్టాడు వార్నర్. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ అంతగా ప్రభావం చూపనప్పటికీ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని రాయల్స్ అభిమానులు ఆశిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్
గత మ్యాచ్‌లో అదరగొట్టిన వార్నర్ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనున్నాడు. కేన్ విలియమ్సన్, బెయిర్స్ట్రోలతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, మనీశ్ పాండేలు ఉన్నారు. భువనేశ్వర్, రషీద్ ఖాన్, కౌల్, షకీబ్ అల్ హసన్‌తో బౌలింగ్ బలంగా ఉంది.
Had a good practice season today at @SunRisers home . Enjoyed every bit of it .. #lovethisgame pic.twitter.com/HUsI3Jw0PA
— Shreevats goswami (@shreevats1) March 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Had a good practice season today at @SunRisers home . Enjoyed every bit of it .. #lovethisgame pic.twitter.com/HUsI3Jw0PA
— Shreevats goswami (@shreevats1) March 28, 2019Had a good practice season today at @SunRisers home . Enjoyed every bit of it .. #lovethisgame pic.twitter.com/HUsI3Jw0PA
— Shreevats goswami (@shreevats1) March 28, 2019
సన్‌రైజర్స్.. వార్నర్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. మిడిల్ ఆర్డర్ కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. యూసఫ్ పఠాన్, మనీశ్ పాండేలు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. గత మ్యాచ్‌లో విజయ్ శంకర్ ఆకట్టుకోవడం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో బలంగా కనిపిస్తున్నప్పటికీ కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు హైదరాబాద్ బౌలర్లు. గత మ్యాచ్‌లో 16వ ఓవర్ వరకు పటిష్ట స్థితిలో ఉన్న జట్టు చివర్లో పరుగులు సమర్పించుకుంది. స్కోరు కట్టడి చేయడంలో దృష్టి పెట్టాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్
గత మ్యాచ్‌లో ఓటమి పాలైన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. రహానే, స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్టీవ్ స్మిత్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్‌లో స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిష్ణప్ప గౌతమ్, ధవల్ కులకర్ణిలు ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్‌లో కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్ బంతితో మంచి ప్రదర్శన చేశారు.
The grind never stops! 💪
— Rajasthan Royals (@rajasthanroyals) March 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Our gym sessions are not just work-out drills, there’s a science behind them. Watch on and find out how! 🏋♂ #HallaBol pic.twitter.com/oLyQrdHo7i
">The grind never stops! 💪
— Rajasthan Royals (@rajasthanroyals) March 28, 2019
Our gym sessions are not just work-out drills, there’s a science behind them. Watch on and find out how! 🏋♂ #HallaBol pic.twitter.com/oLyQrdHo7iThe grind never stops! 💪
— Rajasthan Royals (@rajasthanroyals) March 28, 2019
Our gym sessions are not just work-out drills, there’s a science behind them. Watch on and find out how! 🏋♂ #HallaBol pic.twitter.com/oLyQrdHo7i
జట్ల అంచనా...
హైదరాబాద్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), షకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, బెయిర్‌స్ట్రో(కీపర్), విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, దీపక్ హుడా, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, మార్టిన్ గప్తిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్).
రాజస్థాన్: అజింక్యా రహానే(కెప్టెన్), ధావల్ కులకర్ణి, స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్(కీపర్), ఉనద్కట్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, క్రిష్ణప్ప గౌతమ్, రాహుల్ త్రిపాఠి, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, మనన్ వోహ్రా, టర్నర్, ఇష్ సోధి.
ఇవీ చదవండి