ETV Bharat / briefs

ఏపీ ఎన్నికల్లో ఈసీ నిర్లక్ష్యం... వైకాపా విధ్వంసం... - ap polling

ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ నిర్లక్ష్యం హింసాత్మక పరిణామాలకు దారితీసింది. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించకుండా.. వదిలేసింది. తగినంత మంది భద్రత సిబ్బంది లేని కారణంగా హింస చెలరేగి... ప్రాణాలు తీసుకునేంత వరకూ వెళ్లింది. ఒకటి, రెండు చోట్ల కాదు.. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఇది కచ్చితంగా ఎన్నికల సంఘం వైఫల్యమే.

ఎపీ ఎన్నికల్లో ఈసీ నిర్లక్ష్యం... వైకాపా విధ్వంసం...
author img

By

Published : Apr 13, 2019, 1:51 PM IST

ఈసీ నిర్లక్ష్యం... ఎన్నికల వేళ ఏపీలో పరోక్షంగా హింస ప్రజ్వరిల్లేందుకు కారణమైంది. రాష్ట్రంలో ఎన్నికల భద్రత, బందోబస్తు కోసం 1,06,468 మంది సిబ్బంది అవసరమని ఏపీ పోలీసులు ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల సంఘం మాత్రం తగినంత మందిని కేటాయించలేదు. కేంద్ర సాయుధ బలగాల నుంచి 392 కంపెనీలు కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరగా 197 కంపెనీలనే రాష్ట్రానికి పంపారు.

పొరుగు రాష్ట్రాల నుంచి 5,666 మందే వచ్చారు. 2014 ఎన్నికల కంటే ఈ సారి దాదాపు 45వేల మంది భద్రతా సిబ్బంది తక్కువగా వచ్చారు. సాధారణంగా 10 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సిన చోట అయిదారుగురితోనే సరిపెట్టాల్సి వచ్చింది. సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో అయితే హోంగార్డులతోనే జరిపించారు. అరకొర సిబ్బందితో ఘర్షణలు అదుపు చేయటం భారంగా పరిణమించింది.

స్పీకర్ పై దాడి....

తగినంత మంది భద్రత సిబ్బంది లేకపోవడం వల్ల.. ఎన్నికల విధులతో సంబంధం లేని వారు పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల ఆవలే ఉండాలన్న కనీస నిబంధన అమలు కాలేదు. ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని, అనేక సమస్యాత్మక బూత్‌లు ఉన్నాయని తెలిసీ... ఈసీ తక్కువ కేంద్ర బలగాలను పంపింది. ఎన్నికల వేళ.. దాడులు, ప్రతిదాడులతో గుంటూరు జిల్లాలోని పల్నాడు మరోసారి రక్తమోడింది. సాధారణంగానే పల్నాడు సమస్యాత్మక ప్రాంతం.. ఈ విషయం ముందే తెలుసు.. కానీ.. తగినంత మంది భద్రతా బలగాలను మోహరించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది.

వైకాపా ప్రాబల్యమున్న గ్రామాల్లో... తెదేపా నేతలపై దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తూ సభాపతి కోడెలశివప్రసాదరావుకు రాజుపాలెం మండలం ఇనిమెట్లలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై దాడి చేయడమే కాకుండా చొక్కాను చించేశారు. గంటసేపు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. వందలాదిమంది కార్యకర్తలు చుట్టుముట్టడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తల దాడిలో సభాపతి అనుచరులు ముగ్గురు గాయపడ్డారు. చివరకు అతికష్టం మీద కోడెల... బయటకు రాగలిగారు.

నరసరావుపేట మండలం ఉప్పలపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ రవీంద్ర బాబుపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో అతని చేతికి గాయమైంది.

ఆయన కారు అద్దాలు పగులకొట్టారు. దాచేపల్లి మండలం గామాలపాడు, మాచర్ల మండలం కంభంపాడు, గురజాల, చిలకలూరిపేట మండలం యడవల్లి ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగి పలువురు గాయపడ్డారు. దుర్గిలో తెలుగుదేశం, వైకాపా వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో వైకాపా కార్యకర్తతోపాటు ఓటేయడానికి వచ్చిన మహిళ గాయపడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పుల హెచ్చరిక చేయాల్సి వచ్చింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సరిపడా బలగాలు మోహరించకపోవడం వల్ల ఘర్షణలను అదుపులోకి తేవడం కష్టమైంది. స్ట్రైకింగ్ ఫోర్స్ వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల సంఘం నిర్వహణ లోపాలను తీవ్రంగా ఆక్షేపించారు ఏపీ మంత్రి లోకేశ్‌. తాడేపల్లి మండలం క్రిస్టియన్‌పేట 37వ పోలింగ్ కేంద్రం వద్ద లోకేశ్‌ ధర్నా చేపట్టారు. పోటీగా వైకాపా నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైకాపా వర్గీయులు రెచ్చిపోయినందున స్వల్పంగా లాఠీఛార్జి జరిగింది. వైకాపా ఒత్తిడితో ఎన్నికల కమిషన్ ఓటుపై వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనంటూ... ఆ తర్వాత ట్విట్టర్‌ వేదికగానూ లోకేశ్‌ మండిపడ్డారు.

వైకాపా విధ్వంసం.........

అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి.. ఇక్కడ ప్రత్యర్థుల దాడుల్లో ఒక తెలుగుదేశం కార్యకర్త, మరొక వైకాపా కార్యకర్త మృత్యువాత పడ్డారు. తాడిపత్రి మండలం వీరాపురం వద్ద పోలింగ్ కేంద్రంలో... తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం పార్టీకి చెందిన చింతా భాస్కర్‌రెడ్డి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం వద్ద కూడా తెలుగుదేశం, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

ఇరువర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు దాడి చేసుకున్న ఘటనలో... వెంకటరమణారెడ్డి అనే వృద్ధుడు చనిపోయారు. తగినంత మంది భద్రత సిబ్బంది ఉండి ఉంటే... ఘర్షణలు ప్రాణాలు పోయే పరిస్థితికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. భద్రతా సిబ్బందిలేమి ఇక్కడ పరోక్షంగా ఇద్దరు వ్యక్తుల మరణానికి, ఉద్రిక్తలకూ దారి తీసింది..

ఆళ్లగడ్డలో అలజడి..

కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు తగినంత మంది భద్రత సిబ్బంది లేక ఘర్షణలు అదుపు చేయడం కష్టమైంది. ఆళ్లగడ్డలో గురువారం ఉదయం నుంచీ రాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. 143వ పోలింగ్ బూత్ విషయంలో మంత్రి అఖిలప్రియ, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు విసురుకున్న రాళ్లు తగిలి ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలాయి. చివరకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి... పరిస్థితిని అదుపుచేశారు.

అన్నిచోట్లా గొడవలే...

తిరుపతి గ్రామీణ పరిధిలోని రామానుజపల్లెలోనూ అదే పరిస్థితి. పోలింగ్ సమయం దాటాక కూడా ఓటు వేసేందుకు అనుమతించాలని వైకాపా పట్టుబట్టింది. కుదరదని ఎన్నికల అధికారులు తేల్చిచెప్పినా వైకాపా నేతలు వినలేదు. తెదేపా శ్రేణులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు.... దీనితో ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. కొద్దిసంఖ్యలో ఉన్న పోలీసులకు వారికి అదుపు చేయడం కష్టమైంది..

ఇవన్నీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. తగినంత మంది భద్రత సిబ్బంది లేక పలు చోట్ల చిన్నపాటి గొడవలు కూడా ఘర్షణలుగా మారాయి. గుంటూరు నల్లచెరువు పోలింగ్ స్టేషన్ వద్ద రాజకీయ పక్షాల ఆందోళన లాఠీఛార్జికి దారితీసింది. విజయవాడలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వాహనంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ప్రసాదంపాడులోనూ తెదేపా- వైకాపా కార్యకర్తల మధ్య గొడవ పెరిగి పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వాహనంపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశారు.

శ్రీకాకుళం జిల్లా నరేంద్రపురంలో వైకాపా వర్గీయుల దాడిలో... తెదేపా కార్యకర్త వెంకటస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లోనూ చిన్నచిన్న విషయాలే భద్రత సిబ్బందిలేమితో గొడవలుగా మారాయి. హింసకు దారి తీశాయి. మొత్తం మీద ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కారణంగా ఏపీలో పోలింగ్‌ ఎన్నడూలేనంతగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఎల్లుండే..

Intro:ap_rjy_36_13_sreerama navami_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:వాడవాడలా శ్రీరామనవమి వేడుకలు

Conclusion:జగదభిరాముని కళ్యాణ మహోత్సవాలు వాడవాడలా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం మమ్మిడివరం కాట్రేనికోన మండలాలలో రామాలయాలు వద్ద కళ్యాణ సందడి నెలకొంది సీతారాముల వారిని ప్రత్యేక వేదికపై అలంకరించి కళ్యాణ మహోత్సవాల నిర్వహిస్తున్నారు అనంతరం పానకాలు అన్నసమారాధన భక్తులకు అందజేస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.