వరుస ఘటనలు...
కొద్ది రోజుల క్రితం సుల్తాన్‌పూర్ వద్ద బాహ్యవలయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. గచ్చిబౌలి వద్ద ఖాజాగూడ సమీపంలో మూడు రోజుల క్రితం కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఏపీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారి రాణా ప్రతాప్, కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్, మేడ్చల్ వరంగల్లోనూ ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటివి నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
కారు మంటలకు కారణాలివే
ఇలాంటి ప్రమాదాలకు కారణం కార్ల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, నాసిరకం విడిభాగాలు వాడడం, అధీకృత సంస్థలు రూపొందించే గ్యాస్ కిట్‌లు వాడకపోవడం తదితర కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసే ముందు వాహనాలను నిపుణుల సూచనలు పాటించాలంటున్నారు. అలా చేయడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు.
చోదకులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి:పోలింగ్ శిక్షణకు అందరూ రావాల్సిందే