ఉత్తర వాయువ్య దిక్కు నుంచి వీస్తున్న వడగాలులతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో వారం రోజుల పాటు తీవ్ర వడగాలులతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. ప్రజలు అత్యవసరంగా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి...
ఇవీ చూడండి: పోలీసు విధుల్లో వికసించిన మానవత్వం