డొల్ల కంపెనీలను సృష్టించి నకిలీ ఇన్ వాయిస్‌లతో ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు ఇటీవల జీఎస్టీ తనిఖీల్లో తేలింది. అక్రమాలకు పాల్పడ్డారంటూఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసి, మరికొందరికి సమన్లు జారీ చేశారు. అధికారుల తీరును సవాల్ చేస్తూ సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ శ్రీనివాసరాజు, హిందూస్థాన్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకట సత్య ధర్మావతార్, ఇన్ఫినిటి మెటల్స్ డైరెక్టర్ రమణారెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై కోర్టులో వాదనలు ముగిశాయి.
తీర్పు వచ్చే వరకూ వేచిచూడండి
చెల్లించిన జీఎస్టీ విలువకే ఐటీసీ పొందినట్లు పిటిషనర్లు వాదించారు. అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేశారని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడయ్యే వరకు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని జీఎస్టీ అధికారులకు ఆదేశించింది.
ఇదీ చదవండి:అమల్లోకి తగ్గించిన జీఎస్టీ !