వినూత్న ప్రచారంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు నమో టీ-షర్టులు, కుర్తీలకు లభించిన ఆదరణ చూశాం ఇక నుంచి నమో చీరల ప్రచారం ఎలా ఉంటుందో చూడబోతున్నాం.
'నమో-శారీ' పేరుతో 5లక్షల ప్రత్యేక చీరలను తయారు చేసేందకు గుజరాత్‌లోని సూరత్‌లో వస్త్ర వ్యాపార సంస్థకు ఆర్డర్ దక్కింది.
సింహం పక్కనే మోదీ ఉన్న చిత్రాలను చీరపై అచ్చువేస్తున్నారు. రంగురంగులతో అందమైన ఎంబ్రాయిడరీ వర్క్‌తో అన్ని వర్గాల మహిళలను మెప్పించే విధంగా చీరలను ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపట్టిన పథకాలు అందరికీ తెలిసేలా పలు రకాల చిత్రాలను చీరలపై ప్రింట్ చేస్తున్నారు.
ఈ చీరలను బాక్సులలో ప్యాక్ చేస్తారు. పెట్టె పై భాజాపా ప్రచార నినాదాలు 'సౌనో సాత్-సౌనో వికాస్(అన్ని రంగాల్లో అభివృద్ధి)', 'నమో అగైన్ విజన్-2019' లను అచ్చు వేయిస్తున్నారు.